దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణలోని సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లిలో 11 మంది గర్భిణీలను హోం క్వారంటైన్ కు తరలించారు. కొద్ది రోజుల క్రితం 102 వాహనంలో ఆస్పత్రికి గర్భిణీలు వెళ్లారు. వాహన సిబ్బందిలో ఒకరికి పాజిటివ్ రావడంతో ఇతరులను హోం క్వారంటైన్ కు తరలించారు. మొత్తం 13 మంది మహిళలు వాహనంలో ప్రయాణించగా ఇద్దరు మహిళలకు డెలివరీ అయింది. 
 
రాష్ట్రంలో ఇప్పటికే కొంతమంది వైద్య సిబ్బందికి కూడా కరోనా నిర్ధారణ అయింది. వాహన డ్రైవర్ కు కరోనా సోకడంతో ఆయనను ఇప్పటికే ఆస్పత్రికి తరలించి చికిత్సకు అందిస్తున్నారు. 102 వాహనాలు కేవలం గర్భిణీ స్త్రీల కోసం ఉపయోగిస్తారు. డెలివరీ అయిన ఇద్దరు మహిళలు, వారి పిల్లలు సురక్షితంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అధికారులు వారిని హోం క్వారంటైన్ లో ఉంచి కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులను సంప్రదించాలని సూచించారు. 
 
గర్భిణీలకు హోం క్వారంటైన్ లో ఉంచాలని అధికారులు సూచించటంతో వారి కుటుంబ సభ్యుల్లో కొంత ఆందోళన నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: