పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేస్తే అభిమానులు ఆ ట్రెండ్ ని ఫాలో అవుతారు, ఆయన తెరపై ఎలా కనబడితే అభిమానులు అలా మారిపోతారు. పవన్ ఏ డైలాగ్ చెప్పినా అభిమానులకు కిక్కే కిక్కు... నాక్కొంచెం తిక్కుంది... కానీ దానికో లెక్కుంది, చూడప్పా ...సిద్ధప్పా నేను సింహం లాంటోడిని అది గెడ్డం గీసుకోదు నేను గీసుకుంటాను అంతే మిగతాదంతా సేమ్ టు సేమ్,.... వంటి డైలాగులతో కుర్రకారుని ఉత్సాహపరిచే పవన్ కళ్యాణ్ కొన్ని విషయాల్లో మాత్రం చాలా బిడియంగా ఉంటాడని పవన్ చెప్పుకొచ్చాడు. .... నిజానికి హీరో కావాలని అనుకోలేదు...

IHG

 

కానీ చిన్నతనం నుంచి అన్నయ్య  చిరంజీవి సినిమాలు అంటే అమితమైన ప్రేమ... ఆయన స్ఫూర్తి... ఆయన ఎదుగుదలను మరియు ఎదుగుతున్న తీరు ని ఆశ్చర్యంగా చూసేవాడిని... అభిమానిగా ఆయనకు సెక్యూరిటీ గా  ఉండమన్నది తొలినాళ్ల నా కోరిక... అనుకోకుండా సినిమాల్లోకి రావాల్సి వచ్చింది, ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసినా కెమెరా అంటే నాకు సిగ్గు,  బిడియం, హీరోయిన్స్ తో డ్యూయెట్స్ పాడాలన్న ఎక్కడ లేని మొహమాటం...  అలాంటి నేనేనా... సినిమాల్లో నటిస్తున్నా? అనిపిస్తుంది నా సినిమాలు చూస్తుంటే. అంటూ తన అభిప్రాయాన్ని ఓ సమావేశంలో అభిమానులకు తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: