దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 30 వేలకు పైగా కేసులు నమోదు కావడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇందులో వెయ్యికిపైగా మరణాలు సంభవించాయి. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు కరుణ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి కట్టడికి గుజరాత్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కేసులు ఏమాత్రం తగ్గటం లేదు.

IHG

గురువారం సాయంత్రానికి కొత్తగా మరో 313 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు గుజరాత్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు గుజరాత్లో 4395 కరుణ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే గురువారం ఒక్క రోజే 17 మంది కరోనా బారినపడి చనిపోయారని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 214 మరణాలు సంభవించాయి. గడచిన 24 గంటల్లో 89 మంది  కోలుకొని రీఛార్జి అయినట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి మొత్తం 613 మంది  కోలుకున్నారని ప్రభుత్వం  వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: