భార‌త్‌లో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. గ‌త ప‌ది రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపు అయ్యిందంటే ఈ మ‌హ‌మ్మారి ఎలా రెచ్చిపోతుందో అర్థం చేసుకోవ‌చ్చు. లాక్‌డౌన్ గ‌డువు మే 3వ తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా.. కేసుల సంఖ్య మాత్రం త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోవ‌డంతో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల్లో ఆంద‌ళ‌న మొద‌లైంది. వ‌ర‌ల్డ్ మీట‌ర్ తాజా స‌మాచారం ప్ర‌కారం.. భారతదేశంలో కరోనావైరస్ కేసులసంఖ్య34,863కు పెరిగింది. ఇప్పటివరకు 1,154 మంది ఈ వ్యాధి బారినపడి మరణించారు. ఇక రాష్ట్రాల‌వారీగా చూసుకుంటే.. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాజ‌త్‌, ఢిల్లీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎక్కువ‌గా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి.

 

ఇప్ప‌టివ‌ర‌కు మహారాష్ట్ర లో10,478, గుజరాత్ లో 4,082, ఢిల్లీలో 3,515, మధ్యప్రదేశ్ లో 2,660, రాజస్థాన్ లో 2,438, ఉత్తర ప్రదేశ్లో 2,203, తమిళనాడులో 2,162, ఆంధ్రప్రదేశ్లో 1,403 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 3,305,845 మందికి కరోనావైరస్ సోకింది, ఈ వ్యాధి నుండి మరణించిన వారి సంఖ్య 233,969కు చేరుకుంది. ప‌లు దేశాల్లో క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య ఇలా ఉంది..  యూఎస్ (1,095,019),  స్పెయిన్ (239,639), ఇటలీ (205,463), యూకే (171,253), ఫ్రాన్స్ (167,178), జర్మనీ (163,009). ప్రపంచంలోని మొత్తం క‌రోనా వైర‌స్‌ ప్రభావిత దేశాల సంఖ్య 187 కి చేరుకుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: