రష్యా ప్రధాని మిఖాయిల్‌ మిషుస్టిన్‌ (54) క‌రోనా బారిన‌ప‌డ్డారు.  కరోనా బారినపడిన దేశాల అగ్ర నేతల జాబితాలో రష్యా ప్రధాని మిఖాయిల్‌ మిషుస్టిన్  సై తం చేరిపోయారు. దీంతో ఆయన సెల్ఫ్‌ ఐసోలేషన్‌కు వెళ్లారు. ఆర్థిక వ్యవహారాల బాధ్యతలను పర్యవేక్షించే మిషుస్టిన్‌ తరచూ అధ్యక్షుడు పుతిన్‌ను క లుస్తుంటారు. ఈ నేపథ్యంలో వీరు చివరిసారిగా ఎప్పుడు భేటీ అయ్యారనే వివరాలు ఆరా తీస్తున్నారు. ఇటీవ‌ల బ్రిటన్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ కూడా క‌రోనా బారిన‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకుని క‌రోనాను జ‌యించారు ఆయ‌న‌. 

 

మరోవైపు ఆంక్షల సడలింపు హడావుడి స్థాయిలోనే  అమెరికాలో కరోనా మరణాలు కొనసాగుతున్నాయి. అగ్రరాజ్యంలో   మరో 1,824 వేల మంది వైర‌స్‌కు బలయ్యారు. 26,809 కేసులు నమోదయ్యాయి. దేశంలోని జైళ్లలో 2,700 మంది ఖైదీలకు పరీక్షలు చేయగా 2 వేల మందికి పాజిటివ్‌ వచ్చింది. అయితే, కష్టాలు పోనున్నాయని.. ముందుంది మంచి కాలమని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: