జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌ ప్లానింగ్‌ ప‌క్కాగా ఉంటుంది. ఆయ‌న ఎదుగుద‌ల చూస్తే ఈ విష‌యం స్ప‌ష్టంగా అర్థం అవుతుంది. ఇక త్వ‌ర‌లోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఖాయంగానే క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం రాజమౌళి ట్రిపుల్ ఆర్ విడుదలైన తర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇమేజ్ మ‌రో రేంజ్‌కు చేరుతుంది. ఇందులో డౌట్ అవ‌స‌రమే లేదు. అందుకే ఓ బాలీవుడ్ అగ్ర‌ద‌ర్శ‌కుడు ఇప్ప‌టి నుంచే జూనియ‌ర్ ఎన్టీఆర్ కోసం వెయింటింగ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇంత‌కీ ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌ని అనుకుంటున్నారా.. ఆయ‌న మ‌రెవ‌రో కాదు.. సంజయ్ లీలా భన్సాలీ. నిజానికి.. ఈ దర్శకుడు జూనియర్‌తో సినిమా చేయాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నాడ‌ట‌.

 

రాజమౌళి సినిమా తర్వాత భన్సాలీతో సినిమా చేస్తే పక్కాగా నేషనల్ వైడ్ మార్కెట్ సెట్ అవుతుందని జూనియర్ ఎన్టీఆర్‌ కూడా భావిస్తున్నాడ‌ట‌. వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చే ఈ సినిమాలో ఏకంగా రణ్‌వీర్ సింగ్ విలన్‌గా నటించబోతున్నాడనే ప్ర‌చారం కూడా హాట్‌టాపిక్‌గా మారుతోంది. మరోసారి పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లోనే సినిమా చేయడానికి భన్సాలీ రెడీ అవుతున్నాడు. ఇదే నిజ‌మైతే మాత్రం జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్ మ‌రో మ‌లుపుతిర‌గ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు సంబుర‌ప‌డుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: