భారత దేశంలో ప్రతిరోజూ కరోనా కేసులు ఎన్నో పెరిగిపోతున్నాయి.  గత నెల నుంచి లాక్ డౌన్ అమల్లో ఉన్నా ఈ కరోనాని మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు.  ఒకరు కాదు.. ఇద్దరు కాదు వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి.   గడిచిన 24 గంటల్లో 1823 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దాంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 33,610కి చేరింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 24,162గా నమోదైంది. 8,373 మంది డిశ్చార్జి అయ్యారు. 24 గంటల వ్యవధిలో 67 మంది మృత్యువాత పడగా, మొత్తం మరణాల సంఖ్య 1075కి పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండు కుటుంబాల్లో 12 మందికి కరోనా వైరస్ సోకింది.

IHG

చర్లపలి డివిజన్‌ పరిధిలో ఓ హోల్‌సేల్ వ్యాపారి (65)కి మూడు రోజుల క్రితం కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అంతే కాదు.. ఆయన  సోదరుడు (45), అతడి పెద్ద కోడలు (32), చిన్న కుమారుడు, ఇద్దరు మనవళ్లకు కరోనా సోకినట్టు తేలింది.  అంతే కాదు.. సరూర్‌నగర్‌లోని శారదానగర్‌కు చెందని మరో వ్యాపారి (50), ఆయన తండ్రి, తల్లితోపాటు వనస్థలిపురంలో ఉండే అతడి సోదరుడు (40), సోదరుడి భార్య (35), వారి ఇద్దరు కుమార్తెలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

 

ఇదిలా ఉంటే గత కొంత కాలంగా ఆ వ్యాపారి ఇక్కడే తన వ్యాపారం కొనసాగిస్తున్నారని.. అతని రెగ్యూలర్ కస్టమర్లకు ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఆ వ్యాపారి కుటుంబానికి చెంది వ్యక్తి మరణించడంతో పరిసర ప్రాంత వాసుల్లో కూడా భయం పట్టుకుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: