ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని తీసుకున్న నిర్ణయానికే విద్యార్థుల తల్లిదండ్రులు ఓటేశారు. రాష్ట్రంలో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు చదివే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించగా 96.17 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు అందుకు అంగీకరించారు. వైసీపీ ప్రభుత్వం విద్యారంగంలో భారీ సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. 
 
కానీ ఇటీవల హైకోర్టు ఇంగ్లీష్ మీడియం విషయంలో ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకోవాలని వాలంటీర్ల ద్వారా మూడు ఆప్షన్లతో కూడిన ప్రత్యేక ఫార్మాట్ ను తల్లిదండ్రులకు చేరవేసింది. ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తూ, తెలుగును తప్పనిసరి సబ్జెక్టు చేయడం.. తెలుగు మీడియం, ఇతర భాషా మీడియం ఆప్షన్లను ఇవ్వగా 96.17 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియంలో బోధనకే ఓటు వేశారు. మిగిలిన వారిలో 3.05 శాతం మంది తెలుగు మీడియంకు, 0.78 శాతం మంది ఇతర భాషా మీడియంపై ఆసక్తి చూపారు. 
 
మొదటి నుండి ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబు 96.17 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియంకు ఓటు వేయడంపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: