ఏపీలో క‌రోనా కేసులు చాప‌కింద నీరులా పెరిగిపోతున్నాయి. ఆరంభంలో ప్ర‌భుత్వ నిర్ల‌ప్త‌తో.. ఇటు లాక్‌డౌన్ కొన‌సాగుతున్నా ప్ర‌జ‌ల నిర్ల‌క్ష్య‌మో గాని ఏపీలో ప‌లు కీల‌క ప‌ట్ట‌ణాల్లో క‌రోనా కేసులు విజృంభిస్తున్నాయి. న‌ర‌సారావుపేట‌, వైజాగ్‌, విజ‌య‌వాడ‌, గుంటూరు, క‌ర్నూలు, చిత్తూరు, ఏలూరు లాంటి జిల్లా కేంద్రాల్లోనే క‌రోనా కేసులు ఎక్కువుగా న‌మోదు అవుతున్నాయి. ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా ఈ ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో కేసులు జోరు మాత్రం ఆగ‌డం లేదు. 

 

క‌ర్నూలు, న‌ర‌సారావుపేట లాంటి ప‌ట్ట‌ణాల్లో ప‌రిస్థితి ఘోరంగా ఉంది. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ఏపీలో రెడ్ జోన్లు ప్ర‌క‌టించింది. మొత్తం ఏపీలో ఐదు జిల్లాలు రెడ్ జోన్లుగా ఉన్నాయి. కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు రెడ్ జోన్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆరెంజ్ జోన్ లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖ జిల్లాలు ఉన్నాయి. గ్రీన్ జోన్ లో విజయనగరం జిల్లా ఉంది.  మే 3వ తేదీతో లాక్ డౌన్ ముగియనుండటంతో కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్లను ప్రకటించడంతో ఇక్క‌డ లాక్ డౌన్ మ‌రి కొద్ది రోజులు కంటిన్యూ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: