టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం చేస్తోన్న ఆర్.ఆర్.ఆర్ సినిమా త‌ర్వాత‌ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిందే. ఈ సినిమాను వ‌చ్చే స‌మ్మ‌ర్లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాల‌ని ముందుగా అనుకున్నారు. ఇక రాజ‌మౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాల‌ని అనుకున్నారు. అయితే ఇప్పుడు లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఆర్.ఆర్.ఆర్ సినిమాయే సంక్రాంతికి వ‌స్తుందా ? అన్న క్లారిటీ లేదు.

 

ఈ లెక్క‌న చూస్తే ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ సినిమా ఖ‌చ్చితంగా వ‌చ్చే స‌మ్ముర్‌కు రాద‌న్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది. ఈ క్ర‌మంలోనే త్రివిక్ర‌మ్ ఇప్పుడు అక్కినేని హీరో నాగ‌చైత‌న్య కోసం ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ సిద్ధం చెయ్యడమే కాదు… ఆ కథతో నాని లేదా నాగ‌చైత‌న్య‌తో స్పీడ్‌గా మూడు నెల‌ల్లో ఓ సినిమా కంప్లీట్ చేసే ఆలోచ‌న‌లో త్రివిక్ర‌మ్ ఉన్నాడ‌ట‌. త్రివిక్రమ్ అడిగితె నాని కానీ, చైతు కానీ కాదనరు. ఇదే ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యి... ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్‌కు ఈ వెసులు బాటు ఇస్తే నానికి లేదా చైతుకు ఎన్టీఆర్ నిజంగా దేవుడంటే దేవుడే అవుతాడు అన‌డంలో సందేహం లేదు. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో చైతు లేదా నానికి త్రివిక్ర‌మ్‌తో సినిమా అంటే వాళ్ల మార్కెట్ మామూలుగా రైజ్ అవ్వ‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి: