లాక్ డౌన్ వల్ల ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను సొంతూళ్లకు పంపాలని రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అనుమతితో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు, కార్మికులు, విద్యార్థులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. అధికారులు సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ దగ్గర చిక్కుకుపోయిన వారిని ఎట్టకేలకు స్వస్థలాలకు పంపారు. 
 
 
ప్రత్యేక రైలులో 1100 మంది వలస కూలీలను లింగంపల్లి నుంచి రాంచీకి పంపారు. అధికారులు సంగారెడ్డి నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా కార్మికులను లింగంపల్లికి తరలించారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్, జిల్లా పాలనధికారి హనుమంతరావు, రెవిన్యూ, పోలీసు యంత్రాంగం చప్పట్లు కొట్టి వలస కార్మికులకు వీడ్కోలు పలికింది. రెండు రోజుల క్రితం కంది ఐఐటీ దగ్గర స్వస్థలాలకు పంపించాలని కార్మికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. వారిని అడ్డుకున్న పోలీసులపై కార్మికులు రాళ్లదాడికి పాల్పడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: