ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా విజృంభ‌న ఇప్ప‌ట్లో ఆగేలా లేదు. రాష్ట్రంలో తాజా ప‌రిస్థితిపై ప్రభుత్వం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు హెల్త్ బులిటెన్‌లో ప్రభుత్వం పేర్కొంది. గడచిన 24 గంటల్లో 7902 శాంపిల్స్‌ను పరీక్షించగా 60 మందికి పాజిటివ్ వచ్చిందని ప్రకటించింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులతో కలిపి ఇప్పటి వరకూ ఏపీలో క‌రోనా కేసుల సంఖ్య 1463కు చేరింది. 

 

ఇందులో 403 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఏపీలో కరోనా వల్ల ఇప్పటిదాకా 33 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 1027గా ఉంద‌ని ప్రభుత్వం ప్రకటించింది. 24 గంటల్లో నమోదైన 60 కరోనా కేసుల్లో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 25 పాజిటివ్ కేసులు నమోదవ‌డం గ‌మ‌నార్హం.  ఈ జిల్లాలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 411కు చేరింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: