హ‌మ్మ‌య్య‌..  భారతదేశం, బంగ్లాదేశ్‌ల మధ్య నేడు సరుకు రవాణా ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్‌ 24 పరగనాస్‌, బన్‌గాన్‌ పెట్రాపోల్‌ సరిహద్దు నుంచి వస్తువుల ఎగుమతులు, దిగుమతులు తిరిగి ప్రారంభమయ్యాయి. జీరో పాయింట్‌ వద్ద ట్రక్కుల నుంచి ట్రక్కులలోకి వస్తువుల మార్పిడితో సరుకు రవాణా ప్రారంభమైంది. కరోనా వైరస్‌ విజృంభనతో అప్రమత్తమైన కేంద్రం దేశ సరిహద్దులను చాలా రోజులుగా మూసి వేసిన‌ విషయం తెలిసిందే. ప్రజల కదలికలతో పాటు, సరుకు రవాణాను సైతం నిలిపివేసింది. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించింది.

 

ఇదిలా ఉండ‌గా.. మే 3వ తేదీతో లాక్‌డౌన్‌ ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రెండు దేశాల మ‌ధ్య తిరిగి స‌రుకుల ర‌వాణా ప్రారంభం కావ‌డంతో ప్ర‌జలు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం రోజురోజుకూ పెరుగుతుండ‌డంతో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం నిన్న కీల‌క నిర్న‌యం తీసుకుంది మే నెలాఖ‌రు వ‌ర‌కు లాక్‌డౌన్‌ను కొన‌సాగించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ప‌శ్చిమ‌బెంగాల్‌లోని స‌రిహ‌ద్దు నుంచే కేంద్రం స‌రుకుల ర‌వాణాకు అనుమ‌తి ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: