క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి పశ్చిమ బెంగాల్ స‌ర్కార్ ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈమేర‌కు లాక్‌డౌన్ అమలవుతున్న వేళ పశ్చిమ బెంగాల్‌లోనిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 40 మంది పోలీసు ఉన్నతాధికారులకు స్థాన చలనం కల్పిస్తూ అదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రయోజనార్థమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పశ్చిమ బెంగాల్ పోలీస్ డైరెక్టరేట్ నిన్న వెలువరించిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

బదిలీ అయిన అధికారుల జాబితాలో పశ్చిమ బెంగాల్ టెలీకాం డిప్యూటీ ఎస్పీ, బారాక్‌పూర్ ట్రాఫిక్ ఏసీపీ, బరుయ్‌పూర్ పీడీ డిప్యూటీ ఎస్పీ (క్రైం), జ ల్పైగురి డీఈబీ డిప్యూటీ ఎస్పీ, పశ్చిమ బెంగాల్ సీఐడీ డిప్యూటీ ఎస్పీ, డార్జిలింగ్ (యూటీ) డిప్యూటీ ఎస్పీ సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. కాగా నెల రోజులకు పైగా దేశవ్యాప్తంగా కొవిడ్-19 లాక్‌డౌన్ అమలవుతున్న తరుణంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం క‌ల‌క‌లం రేపుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: