నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం..  కార్మికులు ప్రతి ఏడాది మే 1న ఘనంగా జరుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు కార్మికలోకానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ ఏడాది కరోనా మహ్మారి ప్రభావం వల్ల కార్మికులు ఎలాంటి హడావుడి లేకుండా మే డే జరుపుకుంటున్నారు.  తాజాగా మే డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన   ప్రపంచాన్ని నిర్మించినది కార్మికులు. ఈ ప్రపంచ కార్మిక దినోత్సవం రోజున‌ అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంటున్న మన దేశవ్యాప్తంగా ఉన్న వలస కార్మికులందరి గురించి ఆలోచించండి అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. 

 

 ప్రస్తుతం దేశం చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉందని.. కార్మిక కర్షక లోకం కరానా ప్రభావంతలో కష్టాలు పడుతున్నారని..  ముఖ్యంగా దేశంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల గురించి అందరం ఆలోచిద్దామని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఎంతో మంది వలస కార్మికులు అసాధారణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు  అని చిరంజీవి అన్నారు.  లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు ఎన్ని కష్టాలు పడుతున్నారో ప్రతిరోజూ చూస్తూనే ఉన్నామని.. వారి కష్టాన్నిప్రజలు గమనించాలని చేతనైన సాయం అందించాలని అన్నారు. ఇక సొంత ప్రాంతాలకు తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: