ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఎల్లో మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,02,400 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని... పది లక్షల మంది జనాభాకు 1919 వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని.... ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఎక్కువ సంఖ్యలో పరీక్షలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మాత్రం ఇవేమీ కనబడటం లేదని బుగ్గన అన్నారు. 
 
రాష్ట్రంలో ఎల్లో మీడియా సహాయంతో టీడీపీ దుష్ప్రచారానికి పాల్పడుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు టీడీపీ నేతలెవరూ సహాయం చేయలేదని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 403 మంది డిశ్చార్జ్ అయ్యారని... టెస్టుల ఆధారంగా కరోనా పాజిటివ్ కేసుల శాతాన్ని చూడకుండా ఎల్లో మీడియా దుష్ప్రచారానికి పాల్పడుతోందని విమర్శలు చేశారు. 
 
రాష్ట్రంలొ వైద్యులు అత్యుత్తమ సేవలు అందించడం వల్లే కోలుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని అన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: