ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనాతో ఎవరికీ కంటిమీద కునుకులేకుండా పోతుంది.  ఇప్పటికే లక్ష దాటిన మరణాలు.. లక్షల్లో కరోనా కేసులు చూస్తుంటే మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ మాయదారి కరోనా వైరస్ వల్ల ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోతుంది. తాజాగా  కరోనాతో సహజీవనం తప్పదని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.  గతంలో     ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చెప్పిన మాటలు అక్షర సత్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.  అంతే కాదు  ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయం చెప్పిందని, మరోవైపు ఫేస్‌ మాస్కులు జీవితంలో భాగమని ప్రధాని నరేంద్ర మోదీ కూడా అన్నారని ఆయన చెప్పారు.

 

కరోనాపై సీఎం చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యాలని వ్యాఖ్యానించారు. భవిష్యత్ లో కరోనా వైరస్ ప్రభావం తగ్గినా  మాస్క్ లు వాడటం తప్పని సరి అవుతుందని.. ఇది మన ఆరోగ్య రక్షణగా మారుతుందని అన్నారు.  కరోనా వైరస్‌ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలని జగన్ ఆలోచిస్తుంటే, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లో కూర్చుని విమర్శలు చేస్తున్నారని అన్నారు. 

 

సీఎం జగన్ కరోనా వైరస్‌ను సాధారణ జ్వరంతో పోల్చిన విషయం తెలిసిందే. కరోనా ఎప్పటికీ పూర్తిగా తగ్గే పరిస్థితి ఉండదబోదని, రాబోయే రోజుల్లో కరోనాతో కలిసి జీవించే పరిస్థితి ఉంటుందని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతున్న ప్రజలకు టీడీపీ నేతలెవరూ సాయం చేయలేదని విమర్శించారు. మరోవైపు, తమ ప్రభుత్వం గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: