కరోనా వచ్చి చచ్చిపోతున్నార్రో మోర్రో అంటూ ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తూ ఉన్నాయి.  ఈ లాక్ డౌన్ దేశంలోకొద్ది మంది సీరియస్ గా ఆచరిస్తున్నా.. మరికొంత మంది మాత్రం ఏమాత్రం లెక్కచేయకుండా రోడ్లపై తిరుగుతూనే ఉన్నారు.  ఏదో ఒక కారణం చెబుతూ రోడ్డెక్కుతున్న వీరికి పోలీసులు సైతం అదే రీతిలో బుద్ది చెబుతున్నారు.  కానీ కొంతమంది పద్దతులు మాత్రం మారడం లేదు.  తాాజాగా  నిబంధనలు ఉల్లంఘిస్తూ పోలీసులకు చిక్కుతున్నారు.. చిత్ర విచిత్రమైన శిక్షలు అనుభవిస్తున్నారు.  ప్రతిరోజూ వార్తల్లో సోషల్ మీడియాలో ఇలాంటివి రోజూ చూస్తున్న పనికట్టుకొని కొంత మంది బయటకు వస్తున్నారు. 

 

తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌, నవీన్‌ మండిలో నిబంధనలు ఉల్లంఘించిన సుమారు 10 మందితో పోలీసులు, స్థానిక అధికారులు రోడ్డుపైనే గుంజీలు తీయించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా తీశారు. ఆ మద్య పోలీసులు కొంతమందిని కప్పగంతులు వేయించారు.. మరికొంత మందిని వ్యాయామాలు చేయించారు.. మరికొన్ని చోట్లు కాస్త ఘాటుగానే లాఠీకి పనిచెబుతున్నారు.  కరోనా అరికట్టేందుకు పోలీసులు రాత్రనకా.. పగలనకా కష్టపడుతున్నారు.  కానీ కొంత కాలం ఇంటిపట్టున ఉండమంటే ఉండలేక ఇలా పోలీసులను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు న్యాయం అని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: