తాజాగా తమిళ స్టార్ హీరో అయిన విశాల్  తన తండ్రి గురించి చెబుతూ పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. తన తండ్రి జీవితం ఎప్పుడూ తనకు ఆదర్శంగా నిలుస్తోంది అంటూ ఈ సందర్భంగా విశాల్  తెలిపారు. అంతేకాకుండా తన  కుటుంబంతో ఉన్న ఫోటోని పోస్ట్ చేస్తూ మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది నాన్నా అంటూ ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు విశాల్ . రిటైర్డ్ ఇండియన్ సివిల్ డిఫెన్స్ ఆఫీసర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్, యాక్టర్, వెటరన్ అథ్లెట్, గార్మెంట్ ఎక్స్‌పోర్టర్, మరియు కొబ్లెస్టోన్ రవాణాలో ప్రపంచ రికార్డ్ హోల్డర్ మరియు జికె ఫిట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు మిస్టర్ జి కె రెడ్డి..ఆయనే మా నాన్నగారు.  మీ జీవిత కథ ఎప్పటికీ ఆదర్శం గానే ఉంటుంది... మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది డాడీ అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు విశాల్.

మరింత సమాచారం తెలుసుకోండి: