దేశంలో కరోనా మహహ్మారి రోజు రోజుకీ పెరిగిపోతుంది. గత నెల నుంచి దీని ఎఫెక్ట్ పెరిగిపోతూ వస్తుంది. మొదట ఈ కరోనా విదేశీయుల నుంచి వచ్చిందని వార్తలు వచ్చాయి.. ఆ తర్వాత ఢిల్లీ మర్కజ్ ప్రార్థన సమావేశాల్లో పాల్గొన్న వారి వల్ల వచ్చాయి.  కరోనా ని పూర్తిగా అరికట్టడానికి లాక్ డౌన్ పాటిస్తున్నారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకదశలో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మరోవైపు, ఏపీలో కేసుల సంఖ్య కొన్ని రోజులుగా భారీగా పెరుగుతోంది. 

 

తాజాగా తెలంగాణ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.  ఏపీ, మహారాష్ట్రకు తెలంగాణ వాసులెవరూ వెళ్లొద్దని ఆదేశించింది. ఈ రాష్ట్రాలకు వెళ్లడంపై నిషేధం విధించింది.    అయితే పీ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ వాసులకు ఆ రాష్ట్రాలతో బంధుత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో  ఖమ్మం, నల్గొండ, జిల్లాల ప్రజలు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్తుంటారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు కర్నూలుకు వెళ్తుంటారు.  సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పోలీసు బలగాలను పెంచింది. వీరి ప్రయాణాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: