లాక్‌డౌన్ కార‌ణంగా ఇళ్ల‌కే ప‌రిమిత‌మైపోయారు. ఈ స‌మ‌యంలో న‌చ్చిన సినిమాలు చూస్తున్నారు. ఎవ‌రికి న‌చ్చిన సినిమాలు వారు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ప‌లు చానెళ్లు, యాప్‌లు కూడా ప్ర‌త్యేక సినిమాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. టాలీవుడ్‌లో మాంచి హిట్ కొట్టిన సినిమాల‌ను ప్ర‌సారం చేస్తున్నాయి. అన్నివ‌ర్గాలకు న‌చ్చేలా ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే స‌న్‌నెక్ట్స్ కూడా ప్ర‌త్యేక సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ వీకెండ్‌లో ప్ర‌త్యేకంగా టాలీవుడ్ హీరో నితిన్ సినిమాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

 

నితిన్ కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన చిత్రాల‌ను ప్ర‌సారం చేస్తోంది. ఇటీవ‌లే విడుద‌ల భీష్మ‌, దిల్‌, ఇష్క్‌, సై సినిమాల‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌సారం చేస్తుంది. ఈ సినిమాల‌న్నీ కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన‌వే. ఇందులో దేనిక‌దే స్పెష‌ల్ అని చెప్పొచ్చు. టాలీవుడ్‌లో హీరోల్లో ఎవ‌రిస్టైల్ వారిదే.. ప్రేక్ష‌కుల‌పై ఎవ‌రిమార్క్ వారిదే.! ఇందులో నితిన్ కూడా ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో త‌నదైన ముద్ర‌వేశాడు. ఇక స‌న్ నెక్ట్స్ లో ప్ర‌సారం అవుతున్న ఈ సినిమాల‌తో అభిమానులు పండుగ చేసుకుంటార‌న్న‌మాట‌. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: