ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విధ్వంసం సృష్టిస్తోంది. ప్ర‌ధానంగా యూర‌ప్ దేశాల్లో, అమెరికాలో ఎక్కువ‌గా ప్ర‌భావం చూపుతోంది. ఈ దేశాల్లో జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. రోజుకు వేల సంఖ్య‌లో మర‌ణాలు సంభ‌విస్తున్నాయి. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక కేసులు, మ‌ర‌ణాలు అగ్ర‌రాజ్యం అమెరికాలో న‌మోదు అవుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు అమెరికాలో 10,95,651 పాజిటివ్ కేసులు నమోదుకాగా 63746 మంది మరణించారు. ఆ త‌ర్వాత స్పెయిన్ దేశంలో 2,15,216 పాజిటివ్ కేసులు నమోదుకాగా 24, 824 మంది మరణించారు. ఇటలీలో 2,05,463 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 27,967 మంది మరణించారు.

 

యూకేలో  1,71,253 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 26771 మంది మృతి చెందారు. జర్మనీలో 1,63,009 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా... 6623 మంది మరణించారు. ఫ్రాన్స్‌లో 1,29,581 పాజిటివ్ కేసులు నమోదుకాగా 24376 మంది క‌రోనాకు బ‌ల‌య్యారు. ఇరాన్లో 94 వేల 640 కేసులు నమోదుకాగా.. 6028 మంది మరణించారు. ట‌ర్కీలో 1,20,204 కొవిడ్‌-19 కేసులు, 3,174 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: