వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును, ఎల్లో మీడియాను టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని ఉప్పల్ హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీలో పని చేసే వారికి కరోనా సోకిందని... అక్కడ కంట్రోల్ చేయలేని చంద్రబాబు ఏపీలో కంట్రోల్ చేస్తారా..? అని ప్రశ్నించారు. దేశంలో ఏపీ మినహా మరే రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు కావడం లేదా...? అని ప్రశ్నించారు. 
 
ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలలో ఏపీ కంటే ఎక్కువ కేసులు నమోదు కాలేదా...? అని ప్రశ్నించారు. ఎల్లో మీడియా బుద్ధి ఎప్పటికీ మారదు అంటూ విమర్శలు చేశారు. హెరిటేజ్ లో కరోనా సోకితే పచ్చమీడియా ఎందుకు రాయదని ప్రశ్నించారు. హెరిటేజ్ లో కరోనా గురించి చంద్రబాబు ఎందుకు నోరు మెదపరో చెప్పాలని అన్నారు. చంద్రబాబు ఇతర రాష్ట్రాలకు వెళ్లి కరోనాను కట్టడి చేయాలని సూచించారు. 
 
ఎల్లో మీడియా వార్తల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఏపీలో మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నట్టు ఎల్లో మీడియా వ్యవహరిస్తోందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: