ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డికి తన వద్ద ఉన్న మరో శాఖను అప్పగించారు. పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన శాఖ బాధ్యతలను గౌతమ్ రెడ్డికి కేటాయిస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ సీఎస్ నీలం సాహ్ని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే పలు శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న గౌతమ్ రెడ్డికి తాజాగా మరో శాఖ జతైంది. 
 
జగన్ అకస్మాత్తుగా గౌతమ్ రెడ్డికి ఈ శాఖ కేటాయించడం గురించి ఏపీ రాజకీయ వర్గాల్లో భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. గత కొన్ని రోజుల నుంచి చైనా నుంచి భారత్ కు పరిశ్రమలు రావడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. యూపీ లాంటి దేశాలు ఇప్పటికే ఆ పరిశ్రమలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తామని చెబుతున్నాయి. ఏపీలో కీలక శాఖలను వేరువేరు మంత్రులకు అప్పగిస్తే పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రయత్నించేవారికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని భావించి జగన్ పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన శాఖ బాధ్యతలను గౌతమ్ రెడ్డికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా పరిశ్రమలకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చే అవకాశం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: