టీఆర్ఎస్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు సంతోష్‌కుమార్‌కు మ‌రో ప‌ద‌వి ద‌క్కింది. పార్లమెంట్‌ పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీ (పీయూసీ) సభ్యుడిగా జే సంతోష్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా ఉత్తర్వులు జారీచేశారు. కమిటీ చైర్మన్‌గా meenakshi NAIDU' target='_blank' title='మీనాక్షి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మీనాక్షి లేఖి నియమితులుకాగా, మరో 21 మంది సభ్యులుగా (లోక్‌సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి ఏడుగురు) ఉన్నారు. ఈ కమిటీ 2020-21 సంవత్సరానికి బాధ్యతలు నిర్వర్తించనున్నది. ఎంపీ సంతోష్‌కు ఈ ప‌ద‌వి ద‌క్క‌డంప‌ట్ల గులాబీ శ్రేణులు, అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

 

టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు సంతోష్‌కుమార్ అత్యంత న‌మ్మ‌క‌స్తుడిగా గుర్తింపు పొందారు. పార్టీలో మొద‌టి నుంచీ ఆయ‌న ఎంతో చురుగ్గా ఉంటున్నారు. ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆయ‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపించారు. ఇదే స‌మ‌యంలోసంతోష్‌కుమార్ ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆయ‌న చేప‌ట్టిన గ్రీన్ చాలెంజ్‌ను అన్నివ‌ర్గాల నుంచి అనూహ్య స్పంద‌న వచ్చింది. జాతీయ స్థాయి నాయ‌కులు సైతం ఈ ఛాలెంజ్‌ను స్వీక‌రించి మొక్క‌లు నాటారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: