భార‌త్‌లో క‌రోనా మ‌హమ్మారి స్వైర విహారం చేస్తోంది. దేశ‌వ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్న‌ప్ప‌టికీ... పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. భార‌త్ లో తాజా క‌రోనా హెల్త్ బులిటెనును కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్ర‌కారం... దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 37, 336 కు చేరింది.

 

గ‌డిచిన 24 గంట‌ల్లో 2, 293కేసులు న‌మోదవ్వ‌గా 71 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. మొత్తం 9,950 మంది క‌రోనా నుంచి కోలుకోగా, 26, 167 మంది ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 1,218 మంది క‌రోనాతో చ‌నిపోయారు.  అయితే దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధిక కేసులు ఈ రోజే న ‌మోదైన‌ట్లు  బులిటెన్ లో వెల్ల‌డించారు. 

 

ఇదిలా ఉంటే క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప‌లు స‌డ‌లింపుల‌తో లాక్‌డౌన్ ను మ‌రో రెండు వారాలపాటు పొడిగించింది. ఈనెల 4 నుంచి 17 వ‌ర‌కు మూడో విడుత లాక్‌డౌన్ కొన‌సాగ‌నుంది. దేశాన్ని రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్ అనే మూడు  జోన్లుగా విభ‌జిస్తూ, స‌డ‌లింపులు ఇచ్చింది.  అంతేగాక‌ క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ‌కు వ్య‌క్తిగ‌త ర‌క్ష‌ణ ప‌రిక‌రాలు ( పీపీఈ) పంపిణీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: