దేశంలో ఏ ముహూర్తంలో కరోనా విస్తరించడం మొదలు పెట్టిందో కానీ మనుషులకు మనశ్శాంతి లేకుండా పోతుంది.  ప్రపంచ స్థాయిలో మరణాల సంఖ్య, కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.  హైదరాబాద్, వనస్థలిపురంలో ఓ కుటుంబంలో కరోనా మహమ్మారి తీవ్ర విషాదం నింపింది. రెండు రోజుల వ్యవధిలో తండ్రీ కొడుకులు మరణించారు. వనస్థలిపురానికి చెందిన వ్యక్తి (48)కి ఇటీవల కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో ఆయన కుటుంబం మొత్తాన్ని అధికారులు క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. అయితే బాధిత వ్యక్తి ఇప్పుడు చికిత్స పొందుతున్నాడు.    కుటుంబ సభ్యులందరూ క్వారంటైన్ కేంద్రంలో ఉండడంతో బల్దియా సిబ్బంది వృద్ధుడి అంత్యక్రియలు నిర్వహించారు. 

 

ఇదిలా ఉంటే..  శుక్రవారం సాయంత్రం వృద్ధుడి మరో కుమారుడు మృతి చెందాడు. రెండు రోజుల వ్యవధిలో తండ్రీకుమారులు మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.  ఆ వృద్దుడి పెద్ద కుమారుడు గాంధీలో చికిత్స పొందుతుండగా, అతడి తల్లికి కూడా వైరస్ సంక్రమించింది. ప్రస్తుతం కుటుంబ సభ్యులందరూ క్వారంటైన్ కేంద్రంలోనే ఉన్నారు. ఇదిలా ఉంటే.. బాధిత కుటుంబ సభ్యుల్లో ఇద్దరు చనిపోవడం, మిగతా వారందరూ క్వారంటైన్‌లో ఉండడంతో అప్రమత్తమైన అధికారులు వారుంటున్న ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఇకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడం.. మరో కొడుకు మరణంతో పోరాటం విషాదాన్ని నింపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: