ఓ అంబులెన్స్ డ్రైవర్  లాక్ డౌన్ విధించిన నాటినుంచి ఇప్పటివరకు అంబులెన్స్ లోనే నివాసముంటూ తన కర్తవ్యాన్ని పాటిస్తున్నాడు.  అంబులెన్స్ డ్రైవర్ గత 42 రోజుల నుంచి అంబులెన్స్ లో ఉంటున్నాడు. లాక్ డౌన్   మొదలైన నాటి నుంచి ఏ ఒక్క రోజు కూడా విధులను వదిలేసి తన ఇంటికి వెళ్లలేదు. అతను చిత్తశుద్ధితో  42 రోజుల నుంచి  అంబులెన్స్ లోనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఉత్తర ప్రదేశ్   సాంబాల్  జిల్లాకి చెందిన బాబు భర్తీ(65), అనే వ్యక్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అంబులెన్స్ డ్రైవర్ గా కొనసాగుతున్నారు కరోనా వైరస్  ప్రబలిన నాటినుండి సాంబాల్ జిల్లాలోని హాట్  స్పాట్ ఏరియాలు, కంటోన్మెంట్ జోన్ల లోని  కరోనా బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు బాబు భర్తీ, 9 కిలోమీటర్ల దూరం లో ఉన్నతన  ఇంటికి వెళ్లడం మానేశాడు.

IHG

గత నలభై రెండు రోజుల నుండి కుటుంబ సభ్యులతో ఫోన్లోనే మాట్లాడుతూ యోగక్షేమాలు కనుకుంటున్నాడు. రాత్రిపూట అంబులెన్స్ లోనే నిద్రిస్తూ వ్యవసాయ పొలాల వద్ద బోరు కనిపిస్తే అక్కడే స్నానం చేస్తున్నాడు. భోజన సదుపాయం ఆస్పత్రి వర్గాలు సిద్ధం చేస్తున్నాయి. కరోనా పై యుద్ధం ముగిసిన తర్వాతే ఇంటికి వెళ్తానని చెబుతున్నాడు. తాను ఇలాంటి విపత్కర పరిస్థితులలో తన  వీధులను వదిలి ఇంటికి వెళ్ళను.. తనకు తన డ్యూటీ ఏ ముఖ్యమని తెలియజేశాడు. సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేకపోతే చాలా మంది రోగులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని అన్నాడు.

 

 

 

ప్రతిరోజు అంబులెన్సు ను తాను శానిటైజ్ చేస్తున్నట్లు వివరించాడు. సాంబాల్ జిల్లా కోవిడ్-19 రాపిడ్ యాక్షన్ టీమ్  ఇన్చార్జి డాక్టర్ నీరజ్ శర్మ అంబులెన్స్ డ్రైవర్ బాబు పై ప్రశంసల వర్షం కురిపించాడు. బాబు తన విధుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపాడు. ఇప్పటివరకూ 1100 మంది కరోనా అనుమానితులను ఆస్పత్రికి తరలించాడని తెలియజేశాడు. ఏ సమయంలోనైనా బాబు తమకు అందుబాటులో ఉండి కరోనా బాధితులను ఆస్పత్రికి తీసుకువచ్చేందుకు సహకరిస్తున్నారని తెలిపారు. సాంబాల్‌ జిల్లాలో ఇప్పటి వరకూ 19 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు మరో 200 మంది క్వారంటైన్ లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: