దేశంలో కరోనాని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు మార్చి 24 న దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకించిన విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ 14 వరకు కొనసాగించాలని అన్నారు.. కానీ అప్పటికీ కరోనా కట్టడి కాకపోవడం ఈ నెల 3 వరకు పొడగించారు.  అయితే రేపటితో ఈ సమయం ముగియబోతుంది.. కానీ కరోనా మాత్రం కంట్రోల్ కాకపోవడంతో మరోసారి రాష్ట్ర సీఎంలతో చర్చలు జరిపి తర్వాత ఈ లాక్ డౌన్ మే 17 వరకు  కొనసాగనుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను జారీ చేసింది.  మే 4వ తేదీ నుంచి మూడో విడత లాక్ డౌన్ ప్రారంభం కానుంది.  

 


తాజాగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి  మాట్లాడుతూ.. రెడ్ జెన్లలో లాక్ డౌన్ ను మరింత కఠినం చేయాలని.. అలా అయితేనే కేసులు కంట్రోల్ అయ్యేట్టు ఉందని ఇందుకోసం అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. అయితే లాక్ డౌన్ పెంపు విషయం రాష్ట్రాలతో చర్చించాకే 17 వరకు లాక్ డౌన్ పొడిగించామన్నారు.  ఆయా రాష్ట్రాలు ఇచ్చిన నివేదికల ఆధారంగానే కేంద్రం జోన్లు ప్రకటించింది. ప్రైమరీ కాంటాక్టులు పెరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు.  ప్రజలకు ఈ విషయం అర్థం చేసుకొని కరోనా మహమ్మారిపై యుద్దానికి సిద్దం కావాలని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: