ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ అంత‌కంత‌కూ విస్త‌రిస్తోంది. గ‌డిచిన 24 గంట్ల‌లో కొత్త‌గా 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర‌వ్యాప్తంగా  మొ త్తం క‌రోనా కేసుల సంఖ్య 1, 525కు చేరింది. రాష్ట్రంలో  ఇప్ప‌టి వ‌ర‌కు 33 మంది క‌రోనాతో మృత్యువాత ప‌డ్డారు. వివిధ‌ ద‌వాఖాన‌ల్లో చికిత్స పొంది డిశ్చార్జి అయిన వారి సంఖ్య 441కి చేరింది. ఏపీలో క‌రోనా తాజా హెల్త్ బులిటెన్‌ను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఆయా జిల్లాల్లో న‌మోదైన కేసుల‌ను హెల్త్ బులిటెన్‌లో వెల్ల‌డించారు.

 

ముఖ్యంగా క‌ర్నూలు జిల్లాలో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది.  జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతుండ‌టం ఆందోళ‌న క ‌లిగిస్తోంది. రాష్ట్రంలోనే అత్య‌ధిక‌ కేసులు ఇక్క‌డే న‌మోద‌వుతున్నాయి. కొత్త‌గా జిల్లాలో 25 పాజిటివ్‌ కేసులు న‌మోదవ‌డం గ‌మ‌నార్హం. మ‌రోప‌క్క కృష్ణా జిల్లాలో 12 కేసులు, అనంత‌పురం 4, తూర్పు గోద‌వారి 03, గుంటూరు 02,  క‌డ‌ప 04, నెల్లూరు 06, ప్ర‌కాశం 1, ప‌శ్చిమ గోద‌వారి 1, విశాఖ‌ప‌ట్నం జిల్లాలో 4 కేసులు న‌మోద‌య్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: