దేశంలో కరోనా మహ్మారి రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో మార్చి 24 నుంచి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తూనే ఉంది. కరోనా వల్ల విద్యావస్థ కూడా ఇబ్బందుల పాలైంది.  లాక్ డౌన్ సమయంలో పరీక్షలు కూడా ఆగిపోయాయి.   లాక్ డౌన్ నేపథ్యంలో పాఠశాలలన్నీ మూతపడడంతో విద్యార్థులు ఇండ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల విలువైన సమయం వృద్ధాకాకుండా విద్యార్థుల కోసం టీవీల్లో, ఆన్ లైన్ లో పాఠాలు ప్రసారాలు చేయిస్తుంది ప్రభుత్వం.

 

వాటితో పాటుగానే పద్యాలు, కర్ణాటక సంగీతం, జానపద కళలు, కంప్యూటర్‌ విద్య, ఆరోగ్యం సంబంధిత అంశాలను కూడా టీవీల్లో ప్రసారం చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఈ పాఠాలన్నీ నిపుణ, టీసాట్‌ విద్య, దూరదర్శన్‌ యాదగిరి చానళ్లలో ఈ నెల 4వ తేది నుంచి వారంరోజుల పాటు ప్రసారం కానున్నాయని తెలిపారు. విద్యార్థులకు డిజిటల్‌ పాఠాలు బోధించే నైపుణ్యాన్ని ఉపాధ్యాయులకు అందించే వెబ్‌నార్‌ను కూడా ప్రారంభించారు.

 

ఈ పాఠాలు ప్రసారం చేయడం ద్వారా విద్యార్థులు తమకు శ్రద్ద ఉన్న విభాగాలను ఎంచుకుని నేర్చుకుంటారన్నారు. ప్రతి ఏడాది సమ్మర్ క్యాంపులలో ఏ విధంగా విద్యార్థులకు ఆటలు, పాటలు నేర్పిస్తున్నారో అదే విధంగా ఇప్పుడు టీవీల్లో ఈ పాఠాలను ప్రసారం చేయనున్నారని తెలిపారు.  ఇంటి వద్ద ఉంటూ కరోనాని జయించడమే కాదు... విద్యార్థులు సమయం వృద్దా చేసుకోకుండా ఆన్ లైన్ క్లాసులను వినియోగించుకోవాలని, శ్రద్దగా పాఠాలు నేర్చుకోవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: