క‌రోనా వైర‌స్ సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో జ‌నం విల‌విలాడుతున్నారు. ల‌క్ష‌లాదిమంది ఉపాధిని కోల్పోయారు. తినేందుకు తిండిలేక‌.. నిల‌వ‌నీడ‌లేక దుర్భ‌ర‌జీవితాల‌ను అనుభ‌విస్తున్నారు. జ‌ర్మ‌నీలో సెక్స్‌వ‌ర్క‌ర్ల ప‌రిస్థితులు ద‌య‌నీయంగా ఉన్నాయి. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా వ్యభిచార గృహాలు మూసివేయడం.. లాక్‌డౌన్ విధించ‌డంతో సరిహద్దులు మూసివేయబడటం వలన జర్మనీలో పనిచేస్తున్న వేలాది మంది విదేశీ సెక్స్ వర్కర్లు నిరాశ్రయులయ్యారు. వారి స్వదేశాల‌కు తిరిగి వెళ్లేందుకు అవ‌కాశం లేకుండా పోయింది. ఈ నేప‌థ్యంలో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

క‌రోనా వైర‌స్‌తో త‌మ జీవితం ఛిన్నాభిన్న‌మైంద‌ని, మార్చి నెల‌ మధ్య నుంచి త‌న‌కు ఆదాయం లేద‌ని, క‌నీసం నిద్ర‌పోవ‌డానికి ఇంత చోటు కూడాలేద‌ని పోలిష్ సెక్స్ వ‌ర్క‌ర్ క‌న్నీటిప‌ర్యంమైంది. కాగా, జ‌ర్మ‌నీలో కూడా క‌రోనా వైర‌స్ ఫ్ర‌భావం తీవ్రంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు 164000 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు 6735 మంది క‌రోనా వైర‌స్‌కు బ‌ల‌య్యారు. 121000 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: