ఇప్ప‌టికే ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా ఉన్న హైద‌రాబాద్ ఇప్పుడు స‌రికొత్త హైద‌రాబాద్‌గా రూపాంత‌రం చెంద‌నుంది. ఇప్ప‌టికే మూడు ఎంపీ సీట్లు, 23 ఎమ్మెల్యే సీట్ల‌తో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌గా ఉన్న న‌గ‌రం స‌రికొత్త మాస్ట‌ర్ ప్లాన్‌కు రెడీ అవుతోంది. తాజాగా మంత్రి కేటీఆర్ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్ తో నిర్వ‌హించిన స‌మీక్ష‌లో స‌రికొత్త హైద‌రాబాద్ మాస్ట‌ర్ ప్లాన్‌పై మాట్లాడారు.

 

కేంద్ర స‌డ‌లింపుల నేప‌థ్యంలో చేప‌ట్టాల్సిన పెండింగ్ ప‌నుల‌పై ఆయ‌న మాట్లాడారు. ప్ర‌స్తుతం న‌గ‌రంలో జ‌రుగుతోన్న ప‌నుల‌న్నింటిని జూన్ నెల‌లోపు పూర్తి చేయాల‌ని ఆదేశించారు. జూన్ నుంచి వ‌ర్షాలు కురుస్తాయ‌న్న అంచ‌నాల నేప‌థ్యంలో ఈ లోగానే అన్ని ప‌నులు కంప్లీట్ చేసి హైద‌రాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ న‌గ‌రంగా మార్చ‌డ‌మే మ‌న టార్గెట్ అని చెప్పారు. ఇక లింక్ రోడ్ల‌లో అవ‌స‌ర‌మైతే భ‌సేక‌ర‌ణ చేసి రోడ్ల‌ను వెడ‌ల్పు చేయాల‌ని... అక్క‌డ బాధితుల విష‌యంలో మాన‌వీయ కోణంలో ఆలోచించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. 

 

ఇక హైద‌రాబాద్‌లో ఉన్న ప్ర‌తి లింక్ రోడ్ల‌ను జాతీయ ర‌హ‌దారుల‌కు అనుసంధానం చేస్తారు. ఈ లింక్ రోడ్లు అన్నీ 120 అడుగుల వెడ‌ల్పు ఉంటాయి. అలాగే ప్ర‌పంచ మ‌హాన‌గ‌రంగా మారిన హైద‌రాబాద్ మాస్ట‌ర్ ప్లాన్‌ను అప్‌డేట్ చేస్తారు. ఈ మాస్టర్ ప్లాన్ అప్‌డేట్ అయ్యి అమల్లోకి వ‌స్తే.. మ‌నం స‌రికొత్త హైద‌రాబాద్‌ను చూడ‌నున్నాము. ఇక రైల్వే అండ‌ర్ పాస్‌లు, ఓవ‌ర్ బ్రిడ్జిలు, మ‌రిన్ని స‌రికొత్త ప్రాజెక్టులు అమ‌ల్లోకి రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: