అమెరికాలో కరోనా వైర‌స్ సృష్టిస్తున్న విధ్వంసానికి వేల సంఖ్య‌లో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అయితే.. క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి కాపాడుకునేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదో ఓ రూపంలో మృత్యువు వెంటాడుతూనే ఉంది. దీంతో అమెరికాలోని ధ‌న‌వంతుల‌కు భయం పుట్టింది. త‌మ‌ను తాము క‌రోనా నుంచి కాపాడుకునేందుకు ఏకంగా బంకర్లలో తలదాచుకుంటున్నారు. భూమి లోపల నివాస యోగ్యంగా ఉండే స్థలాన్ని బంకర్‌ అంటారు. అయితే.. న్యూజిలాండ్‌లో విలాసవంతమైన బంకర్లు అనేకం  అమ్మకానికి ఉన్నాయి. ఒక బంక‌ర్‌ ఖరీదు రూ.22 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకూ ఉంటుందట‌.

 

‘రైజింగ్‌ ఎస్‌' అనే కంపెనీ భూమిలోపల ఆరు, ఏడు అంతస్తుల వరకు బంకర్లను నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఒక్కో బంకర్‌లో 22 కుటుంబాల వరకు ఉండవచ్చు. కిచెన్‌, స్నానాల గది, స్విమ్మింగ్‌పూల్‌, జిమ్‌ వంటి వసతులు కూడా ఉంటాయ‌ట‌. టీవీ, ఇంటర్నెట్ వంటి స‌క‌ల‌‌ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అనేక‌మంది బిలియ‌నీయ‌ర్లు బంక‌ర్ల‌లో నివాసం ఉండేందుకు ఇష్ట‌ప‌డుతున్నార‌ట‌. దీంతో అమాంతంగా వాటి ధ‌ర కూడా పెంచేశారు నిర్వాహ‌కులు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: