కొవిడ్ వారియ‌ర్స్ సేవ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపేందుకు ఇండియ‌న్ నేవీ, ఎయిర్స్ ఫోర్స్ సంయుక్తంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం చేప‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. కొవిడ్ ఆస్ప‌త్రుల‌పై పూల వ‌ర్షం కురిపించేందుకు ఏపీలోని విశాఖ తీరంలో ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ అద్భుత‌మైన కార్య‌క్ర‌మాన్ని ఆదివారం ఉద‌యం చేప‌ట్ట‌నున్నాయి. ఈ కార్య‌క్ర‌మం అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. క‌రోనా వైర‌స్ బాధితుల‌కు సేవ‌లు అందిస్తున్న ఆస్ప‌త్రుల‌పై పూల‌వ‌ర్షం కురిపించే కార్య‌క్ర‌మం కోసం అంద‌రూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రాణాల‌కు తెగించి వైద్యులు, న‌ర్సులు, ఇత‌ర సిబ్బంది క‌రోనా బాధితుల‌కు చికిత్స అందిస్తున్నారు.

 

ఈ క్ర‌మంలోనే వైద్య సిబ్బంది కూడా క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సంఖ్య వంద‌ల్లోనే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇందులో ప‌లువురు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవ‌ల ప‌శ్చిమ‌బెంగాల్ వైద్యారోగ్య శాఖ ఉన్న‌తాధికారి కూడా క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డి మృతి చెందారు. ఈ నేప‌థ్యంలో వైద్యులు, ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, పోలీసులు, పారిశుధ్య కార్మికుల సేవ‌ల‌ను దేశం మొత్తం ప్ర‌శంసిస్తోంది. వారిలో సంఘీభావ సంకేత‌తంగా అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఈక్ర‌మంలోనే ఇండియ‌న్ నేవీ, ఎయిర్స్‌ఫోర్స్ సంయుక్తంగా కొవిడ్‌-19 ఆస్ప‌త్రుల‌పై పూల‌వ‌ర్షం కురిపించే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: