దేశ వ్యాప్తంగా శ్రామిక ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఆ దిశగా పలు ఆదేశాలు జారీ చేసింది.   రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని రైల్వే శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డీఎం, డీఆర్‌ఎంలు రాష్ట్ర ప్రభుత్వాలతో ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించారని వివరించింది.  ఎక్కడి నుంచి ఎక్కడికి నడపాలో జోనల్ రైల్వేలే ఖరారు చేస్తాయని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకు రైళ్ల రాకపోకలు అందుబాటులో ఉండాలని రైల్వే శాఖ అధికారులను ఆదేశించింది. రైళ్లు నడిపే అధికారాన్ని జోనల్ రైల్వే అధికారులకే ఇచ్చినట్లు వెల్లడించింది. 

 

తాజాాగా లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని ప్యాసింజర్ రైళ్ల ప్రయాణాలపై మే 17 వరకు నిషేధం ఉంటుందని ఇండియన్ రైల్వేస్ పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాల విన్నపాల మేరకు ఇతర ప్రాంతాల్లో ఉండిపోయిన వలస కార్మికులు, కూలీలు, విద్యార్థులు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం వెళ్లినవారు తమ ప్రాంతాలకు చేరుకోవడం కోసం శ్రామిక్ రైళ్లను మాత్రం నడుపుతామని ప్రకటించింది.   అంతే కాదు  టికెట్ల బుకింగ్స్ కోసం ఎవరూ రైల్వే స్టేషన్లకు రావద్దని విన్నవించింది. సరుకు రవాణా, పార్సిల్ రైళ్లు మాత్రం యథావిధిగా నడుస్తాయని ట్విట్టర్ ద్వారా తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: