దేశంలో లాక్ డౌన్ కొనసాగుంది. ఎక్కడ చూసినా నిశ్శబ్దవాతావరణం కొనసాగుతుంది.  రవాణా వ్యవస్థ అస్తవ్యస్థం అయ్యింది.  దాంతో ఈ ప్రభావం మాంస విక్రయదారులపై పడింది.  ఎప్పుడూ ట్రాన్స్ పోర్ట్ ఉండటంతో మేకలు, కోళ్లు, చేపలు వివిధ ప్రాంతాల నుంచి రావడంతో అమ్మకాలు కొనసాగేవి.  కానీ లాక్ డౌన్ కారణంగా రావాణా జరగకపోవడంతో వీటికి బాగా డిమాండ్ పెరిగింది.  తాజాగా జిల్లాలోని గద్వాల మండలం చెనుగొనిపల్లి చెరువులో 10 టన్నుల చేపలు మృత్యువాతపడ్డాయి. సుమారు రూ. 7 లక్షలు విలువ చేసే 10 టన్నుల చేపలు ఎండ తీవ్రతకు తాళలేక చనిపోయాయి. 

 

ఓ వైపు కరోనా వల్ల నానా ఇబ్బందులు పడుతున్నారు.. మరో వైపు  అకాల వర్షాలు.. వేడిమి తాపాలు మనుషులకే కాదు పశు పక్ష్యాదులకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. చెనుగొనిపల్లి చెరువులో  పది టన్నుల చేపలు చనిపోవడంతో షాక్ తిన్నారు. అయితే ఎండ వేడిమి అధికమవడం, చెరువులో చేపలు బాగా వృద్ధి చెందడం, ఆక్సిజన్‌ సరిపడినంతగా అందకపోవడంతో చేపలు మృతిచెందాయని అధికారులు తెలిపారు.  ఇవన్నీ  ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చెరువులో వదిలిన చేపపిల్లలే.

మరింత సమాచారం తెలుసుకోండి: