భార‌త్‌లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. రోజురోజుకూ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌, మ‌ర‌ణాల సంఖ్య ఎక్కువ అవుతోంది. తాజాగా.. లోక్‌పాల్‌ సభ్యుడు జస్టిస్‌(రిటైర్డు) ఏకే త్రిపాఠి(62) కరోనా వైరస్‌ సోకి చనిపోయారు. కోవిడ్‌తో చికిత్స పొందుతూ ఎయిమ్స్‌లో శనివారం రాత్రి కన్నుమూశారని అధికారులు వెల్ల‌డించారు. ఆయన కుమార్తె, పని మనిషికి కూడా ఈ వైరస్‌ సోకిందని, అయితే.. వారు కోలుకున్నారని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన త్రిపాఠీ, ప్రస్తుత లోక్‌పాల్‌లోని నలుగురు సభ్యుల్లో ఏకే త్రిపాఠి ఒకరు.

 

ఈ విష‌యం తెలియ‌గానే దేశ ప్ర‌ముఖులు దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. ఆయ‌న మృతికి సంతాపం తెలిపారు. ఏకే త్రిపాఠి అందించిన సేవ‌ల‌ను గుర్తు చేసుకుంటున్నారు. కొవిడ్‌-19తో ప‌లువురు ప్ర‌ముఖులు కూడా మ‌ర‌ణిస్తుండ‌డం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. మొన్న ప‌శ్చిమ‌బెంగాల్‌లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్న‌తాధికారి కూడా క‌రోనా వైర‌స్‌తో మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దేశ‌వ్యాప్తంగా మ‌రికొంద‌రు ప్ర‌ముఖులు కూడా క‌రోనాతో పోరాడుతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: