భార‌త్‌లో కొవిడ్ -19 ప్ర‌భావం ఎక్కువ అవుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 39,699 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి 1323 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు.  ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 10,018 మంది కోలుకున్నారు. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, ఢిల్లీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్తాన్ రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ కేసులు ఎక్కువ‌గా న‌మోదు అవుతున్నాయి. మ‌హారాష్ట్ర‌లో 11, 506 కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 485 మంది మృతి చెందారు.

 

ఢిల్లీలో 3738 కేసులు న‌మోదు కాగా, 61మంది మ‌ర‌ణించారు. గుజ‌రాత్‌లో 4721 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 236 మంది మ‌ర‌ణించారు. మ‌ధ్య‌ప్రదేశ్‌లో 2719 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 145 మంది మ‌ర‌ణించారు. అలాగే.. రాజ‌స్తాన్‌లో 2,666 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా, 62మంది మ‌ర‌ణించారు. ఆ త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌దిత‌ర రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ కేసులు, మ‌ర‌ణాలు ఎక్కువ‌గా న‌మోదు అవుతున్నాయి. కాగా, ఈ నెల 17వ తేదీ వ‌ర‌కు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగించిన విష‌యం తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: