తీవ్ర‌మైన మాన‌సిక ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలతో  మూడు సార్లు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని అనుకున్నాన‌ని  భారత‌ పేసర్ మొహమ్మద్ షమీ షాకింగ్ కామెంట్ చేశారు. ఈమేర‌కు  ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్ శర్మతో లైవ్ చాట్‌లో దిగ్భ్రాంతికరమైన విష‌యాలు వెల్లడించారు.  వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యల కా రణంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాన‌ని, దీంతో  ఆత్మహత్య చేసుకోవాల‌ని బావించాన‌ని షమీ పేర్కొన్నారు. అయితే పరీక్షా సమయాల్లో త‌న‌కు కుటుంబ స‌భ్యులు మద్దతుగా నిలిచార‌ని అన్నారు.

"2015 లో నేను ప్రపంచ కప్‌లో గాయపడ్డాను. ఆ తరువాత, తిరిగి జ‌ట్టులోకి రావడానికి 18 నెలలు పట్టింది . ఇది నా కెరీర్‌లో అత్యంత బాధాకరమైన దశ. ఐపిఎల్‌కు 10-12 రోజుల ముందు ప్రమాదం జరిగింది. నా వ్యక్తిగత సమస్యలతో మీడియాలో కూడా చాలా హైప్ జరుగుతోంది ” అని షమీ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో రోహిత్‌తో అన్నారు. ఏదేమైనా, వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యల ఒత్తిడిని ఎదుర్కోవడం అంత సులభం కాదని షమీ వెల్లడించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: