దేశంలో కరెోనా మహమ్మారి తీవ్రత బీభత్సంగా ఉంది.   ఈ నేపథ్యంలో మార్చి 24 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  అప్పటి నుంచి అన్ని వ్యవస్థలు మూతపడ్డాయి.  ముఖ్యంగా మద్యం దుకాణాలు బంద్ చేశారు.  దాంతో మందుబాబుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.  మందుబాబులు తట్టుకోలేక పిచ్చెక్కినవారిలో ప్రవర్తిస్తున్నాు.  తాాజాగా మద్యం దుకాణాల తెరవాలా వద్దా అన్న విషయంపై తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలో పడింది.  లాక్ డౌన్ 2.0 నేటితో ముగియనుండగా, తెలంగాణలో మాత్రం 7వ తారీఖు వరకూ అమలులో ఉండనుందన్న సంగతి తెలిసిందే.

 

ఈలోగా, లాక్ డౌన్ మూడో విడతను ప్రకటించిన కేంద్రం, మరో రెండు వారాలు నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేస్తూనే, వైన్స్ షాపులను ఓపెన్ చేసేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో మద్యం విధానంపై కేంద్రం సూచించిన విధంగా సోమవారం నుంచి షాపులను తెరచుకునేందుకు అనుమతించాలా? వద్దా? అన్న విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 

 

పలువురు మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఫోన్ చేసిన కేసీఆర్, లాక్ డౌన్ సడలింపులు, తదుపరి పర్యవసానాలపై చర్చించారు. నేడు మరికొందరి మనోగతాలను తెలుసుకుని, ఆపై నిఘా వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరించి, మద్యం షాపులపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెలువరిస్తారని తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: