సాధారణంగా పిల్లీ ఎలుకల మద్య వైరం అంటారు. కుక్క, పిల్లికి అస్సలు పడదు.. కోతులు, కుక్కలు ఇలా కొన్ని జంతువులు ఆగర్భ శత్రువుల్లో ఉంటారు.  ఇక పాము -ముంగీస ఎంత ఎలాంటి శత్రువులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఒక్కోసారి పొంతనే ఉండని జంతువుల మధ్య స్నేహం ఉంటుందనడానికి ఈ చిత్రాలు ఓ ఉదాహరణ. నెటిజన్లు వింతగా చూస్తున్న దృశ్యాలివి. ఓ పిల్లి, పాముతో స్నేహం చేసింది. అయితే పాములు కనిపిస్తే.. పిల్లులు వాటిని చంపేవారకు ఆగవు.  అలాంటిది ఓపాము పిల్లి హ్యాపీగా కలిసి ఉంటున్నాయి. 

 

డిచ్ సోనీ అనే మహిళ రికీ అనే పేరున్న నల్ల పిల్లిని పెంచుకుంటూ ఉండగా, దానికి ఓ నల్లటి పాము కనిపించింది. పాముతో, పిల్లి సహజ స్వభావానికి విరుద్ధంగా స్నేహం ప్రారంభించింది. కొన్ని రోజులుగా పిల్లి, పాము స్నేహాన్ని చూసిన డిచ్ సోనీ, వాటిని ఫోటోలు తీసి, సోషల్ మీడియాలో పెట్టగా, అవి వైరల్ అయ్యాయి. 

 

తన  పిల్లి ఎప్పుడూ పాముతో ఆడుకుంటోందని, ఏ జీవి, మరో జీవికి హాని చేయడం లేదని వ్యాఖ్యానిస్తూ, చూసేందుకు ఇవి సన్ బాత్ చేస్తున్నట్టుగా ఉందని కామెంట్ పెట్టింది.   గత కొన్ని రోజులుగా  పిల్లి, పాము స్నేహాన్ని చూసిన డిచ్ సోనీ, వాటిని ఫోటోలు తీసి, సోషల్ మీడియాలో పెట్టగా, అవి వైరల్ అయ్యాయి. . ఇక ఈ 'పిల్లి, పాముల వింత స్నేహం' ట్వీట్ లక్షకు పైగా రీ ట్వీట్లను తెచ్చుకుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: