క‌రోనా బారిన‌ప‌డి చావు అంచుల దాకా వెళ్లి వ‌చ్చారు బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌ .. క‌రోనా వైర‌స్ సోక‌డంతో వైద్యులు ఆయన్న‌ ఐసీయూలో ఉంచి అత్య‌వ‌స‌ర చికిత్స అందించారు. దీంతో పూర్తిగా కోలుకున్న ఆయ‌న ద‌వాఖాన నుంచి ఇటీవ‌లే డిశ్చార్జి అయిన విష‌యం తెలిసిందే.  ఈక్ర‌మంలో నే  తన చికిత్స అనుభవానుల మీడియాతో పంచుకున్నారు భావోద్వేగానికి గుర‌య్యారు ఆయ‌న‌. కోవిడ్‌ బారినపడిన తనకు వైద్యులు అద్బుతమైన సేవలను అందించారని వారిపై ప్రశంసల జల్లు కురిపించారు. 

ఇదిలా ఉంటే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్  భార్య‌ క్యారీ సైమండ్స్ (32) బుధవారం లండన్‌లోని ఓ ద‌వాఖాన‌లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే తన ప్రాణాల‌ను కాపాడిన వైద్యుడి పేరే తన బిడ్డకు పెట్టి కృతజ్ఞతను చాటుకున్నారు జాన్స‌న్‌. ఆ పిల్లోడికి విల్‌ఫ్రెడ్ లారీ నికోల‌స్ జాన్స‌న్ అని పేరు పెట్టారు. ఆ పేరులో ఇద్ద‌రు తాత‌య్య‌ల పేర్లు, బోరిస్‌కు చికిత్స అందించిన‌ మ‌రో ఇద్ద‌రు డాక్ట‌ర్ల పేర్లు ఉన్నాయి. దీనిపై స్పందించిన వైద్యులు తమకు ఇం తకన్నా పెద్ద గౌరవం ఏముందటుందని ఆనందం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: