ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19పై యుద్ధం చేస్తున్న యోధుల‌కు భార‌త ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, నేవీ బలగాలు  గౌర‌వ వంద‌నం స‌మ‌ర్పించిన సంగ‌తి తెలిసిందే. క‌రోనాపై  పోరులో ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి  24 గంటలు పనిచేస్తున్న వైద్య సిబ్బందికి సంఘీభావం తెలుపుతూ, ఇవాళ దేశ వ్యాప్తంగా కరోనా ఆస్పత్రులపై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పూలవర్షం కురిపించింది.   విశాఖలోని చెస్ట్‌, గీతం ఆస్పత్రి, హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, నేవీ బలగాల సంయుక్త విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వైద్యులు, వైద్య సిబ్బందికి సంఘీభావంగా సముద్రతీరాల్లో నౌకలు నిలిపిన నేవీ తమ కృతజ్ఞతను చాటుకుంది.  

అయితే ఈ ఘ‌ట‌న‌పై దేశ‌వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్య‌క్తం అవుతున్నాయి. అటు కొవిడ్‌తో పోరాడుతున్న వైద్యు‌ల‌‌తోపాటు ఇటు స‌రిహ‌ద్దుల్లో ప‌హారా కాస్తూ దేశాన్ని కాప‌డుతున్న సైనికుల‌కు ప‌లువురు సెల‌బ్రెటీలు త‌మ సంఘీభావం ప్ర‌క‌టిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి త్రివిధ ద‌ళాల‌తోపాటు వైద్య సిబ్బందికి ట్విట‌ర్ ద్వారా అభినంద‌న‌లు తెలిపారు. స‌రిహ‌ద్దులు దాటి వ‌చ్చే ఉగ్ర‌వాదుల‌పై పోరాడి, దేశాన్ని కాపాడే సైనికులు... క‌ని‌పించ‌ని వైర‌స్ అంద‌రిపై దాడి చేస్తుంటే అహ‌ర్నిష‌లు మ‌న‌ల్ని కాపాడేందుకు ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌కు పుష్పాభివంద‌నం చేయ‌డం అభినంద‌నీయం అని చిరంజీవి పేర్కొన్నారు. మీ ఇద్ద‌రికీ మేము రుణ‌ప‌డి ఉన్నాం అంటూ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: