క్రీడాకారుల‌కు కేంద్రం శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతోంది. క్రీడా శిక్ష‌ణ శిబిరాల‌ను తిరిగి ప్రారంభించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఈ విష‌యాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిర‌ణ్‌రిజుజు చెప్పారు. మే నెల చివరి నాటికి ఒలింపిక్‌కు చెందిన అథ్లెట్ల కోసం జాతీయ శిబిరాలను దశలవారీగా తిరిగి ప్రారంభించడానికి తమ మంత్రిత్వ శాఖ ప్రణాళికను రూపొందిస్తోందని కేంద్ర‌ క్రీడా మంత్రి కిరెన్ రిజిజు ఆదివారం తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం మే 17 వరకు దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. దీంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) కేంద్రాల్లో శిక్షణా శిబిరాలను తిరిగి ప్రారంభించడాకి అవ‌కాశం లేకుండా పోయింద‌ని ఆయ‌న తెలిపారు.

 

అయితే.. లాక్‌డౌన్ ముగిసిన త‌ర్వాత క్రీడా శిబిరాలు దశల వారీగా ప్రారంభమవుతాయ‌ని తెలిపారు. *మొదట మేం ఎన్‌ఐఎస్ పాటియాలా, బెంగళూరులోని ఎస్‌ఐఐలో శిక్షణను ప్రారంభిస్తాం, ప్రస్తుతం అథ్లెట్లు ఇక్కడ ఉన్నారు ... ఈ నెల చివరి నాటికి బెంగళూరు, పాటియాలాలో శిబిరాలు ప్రారంభ‌మ‌వుతాయి* అని కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు చెప్పారు. దీంతో క్రీడాకారులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: