ఓ వైపు కరోనా భయాలు, మరో వైపు లాక్ డౌన్. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆ ఇద్దరు అంబులెన్స్ డ్రైవర్లు సాహసం చేశారు. ఓ మృతదేహాన్ని స్వస్థలం చేర్చేందుకు యుద్ధ‌మే చేశారు.  అతడి కుటుంబ సభ్యులకు కడచూపు దక్కేలా చేశారు. ఇందు కోసం ఏకంగా 5 రాష్ట్రాల మీదుగా 84 గంటల పాటు 3 వేల కిలోమీటర్లు డెడ్ బాడీతో జర్నీ చేశారు. ఇప్పుడా అంబులెన్స్ డ్రైవర్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రియల్ హీరోస్ అని అంతా కితాబిస్తున్నారు. వారికి సెల్యూట్ చేస్తున్నారు. 

 

మిజోరాంన‌కు చెందిన యువకుడు చెన్నైలో మృతి చెందాడు. కాగా యువకుడి మృతదేహాన్ని అతడి ఇంటికి చేర్చారు జియాంతిరన్, చిన్నతంబి..  నే అంబులెన్స్ డ్రైవర్లు. ఏప్రిల్ 24న అర్థరాత్రి చెన్నై నుంచి డెడ్ బాడీతో బయలు దేర‌గా,  27న ఉదయం 4 గంటలకు మిజోరం చేరుకున్నారు. ఈ మొత్తం జర్నీలో కేవలం ఆహారం, ఇంధనం కోసం మాత్రమే వారు అంబులెన్స్ ఆపారు. ఒకరు 8 గంటలు, మరొకరు 8 గంటలు పాటు డ్రైవింగ్ చేశారు. ఏక దాటిగా 84 గంటల పాటు 3 వేల కిలోమీటర్లు ప్రయాణించి మిజోరంలో యువకుడి మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. చెన్నై అంబులెన్స్ డ్రైవర్లుకు మిజోరం ముఖ్యమంత్రితో పాటు ఆ రాష్ట్ర ప్రజలు సెల్యూట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: