కరోనావైరస్ వ్యాప్తిని నిలువరించడంలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ ఫలితంగా మనుషులందరూ తమ ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రోడ్ల‌న్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే అడువుల్లో ఉండే వన్య‌ప్రాణులు సైతం రోడ్ల మీద‌కు వ‌చ్చేస్తున్నాయి. ఇక అడవుల‌కు స‌మీపంలో ఉండే ప్రాంతాల్లో ప్ర‌జ‌లు అయితే వ‌న్య ప్రాణులు రోడ్ల‌మీద‌కు వ‌స్తుండ‌డంతో ప్రాణాలు అర‌చేతిలో పట్టుకుని బిక్కు బిక్కు మంటూ జీవ‌నం కొన‌సాగిస్తున్నారు. ఇటీవ‌ల‌ తిరుమలలో కూడా అడవిమృగాలు రోడ్లపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు గుజ‌రాత్‌లోని ఓ పాఠ‌శాల‌లోకి ఏకంగా అడ‌వి రాజు సింహం వ‌చ్చింది. గిర్ సోమనాథ్ జిల్లాలోని ఉనా గ్రామంలోని ఓ స్కూల్ ఆవరణలో బుధవారం ఉదయం ఓ సింహం తిరుగుతూ కన్పించింది. దగ్గర్లోని షెడ్ దగ్గర జింకను వేటాడుతూ స్కూల్ ఆవరణలోకి సింహం వచ్చింది. 

 

ఆ సింహం స్కూల్ బిల్డింగ్ లోప‌ల‌కు వెళ్ఇ అక్క‌డ తిరుగుతోంది. ఇది చూసిన కొంద‌రు భ‌యంతో ప‌రుగులు తీయ‌గా.. మ‌రి కొంద‌రు మాత్రం ఓ పైపు సాయంతో అక్క‌డున్న గేట్ల‌ను మూసివేశారు. దీంతో ఆ సింహం లోప‌ల ఇరుక్కుపోయి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు గేట్ల‌ను బ‌ద్ద‌లు కొట్టేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేసింది. చివ‌ర‌కు అక్క‌డ‌ సిబ్బంది ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వాళ్లు స్కూల్ ఆవరణలో ఉన్న సింహాన్ని బోనులో బంధించి జసధర్ ఎనిమల్ కేర్ సెంటర్ కు తీసుకెళ్లి రొటీన్ టెస్ట్ తర్వాత దానిని అడవికి తీసుకెళ్లి వదిలిపెట్టారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: