మెగా మేన‌ళ్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో వ‌రుస హిట్ల‌తో దూసుకు పోతున్నాడు. ప్ర‌స్తుతం లాక్ డౌన్‌, క‌రోనా అంటూ హ‌డావిడి లేక‌పోతే ఈ స‌మ్మ‌ర్‌లో సాయి న‌టించిన సోలో బ‌తుకే సినిమా మే 1న విడుద‌ల కావాల్సి ఉండేది. ప్ర‌స్తుతం లాక్ డౌన్ నేప‌థ్యంలో సాయి ఇంట్లోనే కూర్చుని కాస్త రెస్ట్ తీసుకుంటున్నాడు. త‌న తాజా ఇంట‌ర్వ్యూలో సాయి త‌న పెళ్లి గురించి బిగ్ అప్టేడ్ ఇచ్చాడు. మీ పెళ్లి ఎప్పుడు అన్న ప్ర‌శ్న‌కు బ‌దులు ఇస్తూ మా అమ్మ ఇప్ప‌టికే పెళ్లి చేసుకోమ‌ని రోజూ తెగ గొడ‌వ చేస్తున్నార‌ని.. ఇప్ప‌టికే 33 వ‌చ్చేశాయి క‌దా.. ఇంకెప్పుడు పెళ్లి.. త్వ‌ర‌గా చేసుకో అని అమ్మ అంటోంద‌ని సాయి చెప్పాడు.

 

అలాగే మెగా హీరోలు ల‌వ్ మ్యారేజ్ చేసుకున్నార‌న్న ప్ర‌శ్న‌కు స్పందిస్తూ అదృష్టం క‌లిసి వ‌చ్చి తాను కూడా ఈ యేడాది ల‌వ్‌లో ప‌డొచ్చేమో అన్న సాయి మ‌నం యూత్ క‌దా ? ఆ మాత్రం స‌ర‌దా ఉండాల‌ని... అయినా ఎప్ప‌టికైనా మ‌నం పెళ్లి చేసుకోవాల్సిందే... మ‌నం పెళ్లి గురించి ఎంత దూరం జ‌రుగుదామ‌ని అనుకున్నా ఇంట్లో వాళ్లు ఆ విష‌యాన్ని ప‌దే ప‌దే గుర్తు చేస్తూ ఉంటార‌ని సాయి చెప్పాడు. ఇక ఈ యేడాది పెళ్లి గురించి ఆలోచ‌న చేస్తారా ? అన్న ప్ర‌శ్న‌కు సాయి బదులు ఇస్తూ తాను ట్రైం చేయ‌డం మాట ఎలా ?  ఉన్నా ఇంట్లో వాళ్లు మాత్రం అదే ప‌నిమీద ఉంటార‌ని చెప్పాడు. ఏదేమైనా 33 ఏళ్ల సాయి త్వ‌ర‌లోనే పెళ్లికి రెడీ అవుతున్నాడ‌నే అనుకోవాలి.

   

మరింత సమాచారం తెలుసుకోండి: