దేశంలో మార్చి 24 నుంచి లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో మద్యం దుఖానాలు బంద్ చేశారు.. దాంతో మద్యం ప్రియులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే మద్యం విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వస్తున్న విషయం తెలిసిందే.  ఎప్పుడుతైన లాక్ డౌన్ మొదలైందో మద్యం విక్రయం ఆగిపోవడంతో అటు ప్రభుత్వం ఆదాయానికి గండి పడింది.  దాంతో ఇప్పుడు మద్యం షాలపులకు పరిమిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే అది రెడ్ జోన్లో కొన్ని ఆంక్షలు విధించారు.  ఇక దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నుంచి మద్యం షాపులు తెరుచుకోనున్నాయి.

 

కంటైన్మెంట్ జోన్ల పరిధిలో లేని ప్రాంతాల్లో దాదాపు 450 మద్యం షాపులను తెరిచేందుకు అనుమతినిచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ షాపులన్నీ విడివిడిగా ఉన్నవని, వీటిలో ఏ ఒక్క షాపు కూడా మాల్స్‌లో కానీ, ఇతర వ్యాపార సముదాయాల్లో కానీ లేదని పేర్కొంది.  450 వేరువేరుగా వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. మద్యం దుకాణాలను తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వడంతో వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న దుకాణాల వరకు తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం అనుమతిచ్చినట్లు తెలిపింది. 

 

ఈ వ్యాపారం జన సందోహంలో ఉండరాదని తెలిపింది. ఇదిలా ఉంటే 4వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అంతే కాదు లాక్‌డౌన్ పొడిగించినప్పటికీ రెడ్‌జోన్ కాని ప్రాంతాల్లో పొగాకు, మద్యం దుకాణాలను తెరుచుకోవచ్చని తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: