దేశంలో కరోనా రోజు రోజుకీ పెరిగిపోతుంది.   కరోనాని కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.   మార్చి 24 నుంచి లాక్ డౌన్ మొదలైంది.. దాంతో కోరానా ఇతర దేశాలతో పోల్చితే పెద్ద ఎత్తన కంట్రోల్ అవుతుంది. అయితే మహరాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు.. మరికొన్ని రాష్ట్రల్లో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. తాజాగా ఏపిలో గత 24 గంటల్లో  6534 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 58 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యశాఖ ప్రకటించింది.

 

తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1583కు చేరుకుందని ఆ శాఖ బులెటిన్ పేర్కొంది.  అయితే..  కరోనా వైరస్ నుంచి  కోలుకున్నవారి మొత్తం సంఖ్య 488 కు చేరుకుందని తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 33 కోవిడ్‌ మరణాలు సంభవించాయని, గత 24 గంటల్లో ఎటువంటి మరణాలు చోటుచేసుకోలేదని ఆరోగ్యశాఖ మీడియా బులెటిన్‌లో పేర్కొంది. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1062గా ఉందని ఆరోగ్య శాఖ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: